వరంగల్ బ్యూరో, మార్చి 5 (ప్రజాజ్యోతి):
ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని వివిధ సెంటర్లలో విద్యార్థులు సకాలంలో పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం సంస్కృతం ఇంగ్లీష్ ఉర్దూ పరీక్షలు జరిగాయి. జిల్లా ఇంటర్మీడియట్ అధికారులు పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించారు. పోలీస్ అధికారులు బందోబస్తూ నిర్వహిస్తూ, 144 సెక్షన్ అమలు చేస్తూ, పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూసారు.