ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఇరాన్ దేశ కరెన్సీ ‘రియాల్’ విలువ దారుణంగా పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే దాని విలువ ఏకంగా 9,50,000 రియాల్స్‌కు పతనమైంది. 2015లో ఇది 32 వేల రియాల్స్‌గా ఉండేది. కరెన్సీ విలువ ఊహించని రీతిలో పతనం కావడంతో దేశంలో గగ్గోలు మొదలైంది. దీంతో కరెన్సీ విలువ పతనానికి బాధ్యుడిని చేస్తూ దేశ ఆర్థిక మంత్రి అబ్దోల్‌నాసెర్ హెమ్మతిని పార్లమెంట్ అభిశంసించింది. 273 మంది చట్ట సభ్యుల్లో 182 మంది ఆయనకు వ్యతిరేకంగా ఓటేశారు
అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ గతేడాది జులైలో బాధ్యతలు చేపట్టినప్పుడు డాలర్‌తో పోలిస్తే రియాల్ విలువ 5,84,000గా ఉండేది. అయితే, గత ఆరు నెలల్లో ఆర్థిక వ్యవహారాలపై దేశం నియంత్రణ కోల్పోవడంతో పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. ప్రస్తుతం ఒక్క డాలర్ కోసం దాదాపు 10 లక్షల రియాళ్లు చెల్లించాల్సి వస్తోంది.
2015 అణు ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోవడం, పశ్చిమ దేశాల ఆంక్షలతో ఇరాన్ విలవిల్లాడుతోంది. ప్రపంచంలో అతి తక్కువ విలువ ఉన్న కరెన్సీల్లో ఇరాన్ రియల్ మూడో స్థానంలో ఉంది. కాగా, నేటి ఆర్థిక పరిస్థితికి ఏ ఒక్క వ్యక్తినో నిందించడం సరికాదని, ఒక్క వ్యక్తిపైకి దానిని తోసివేయలేమంటూ ఆర్థిక మంత్రి అబ్దోల్‌నాసెర్ హెమ్మతిని