నా చావుకు కారణం అభి… అంటూ ఓ యువతి (24) సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. ఖమ్మం రూరల్ ఏరియా పొన్నెకల్లులో ఈ ఘటన చోటుచేసుకుంది. బలవన్మరణానికి పాల్పడిన యువతిని కావ్య కల్యాణిగా గుర్తించారు. ఆమె తన సెల్ఫీ వీడియోలో ఆరోపణలు చేసిన వ్యక్తి అభి… ఢీ టెలివిజన్ షోలో ఓ డ్యాన్సర్ అని తెలుస్తోంది.
తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని చెప్పి అభి మోసం చేశాడని, ఐదు సంవత్సరాల నుంచి తాను అభి వాళ్ల ఉంట్లోనే ఉంటున్నానని కావ్య వెల్లడించింది. కానీ, అతడు ఇప్పుడు తనను వదిలేసి మరో అమ్మాయిని తీసుకువచ్చి, ఆమెనే పెళ్లి చేసుకుంటానని చెబుతున్నాడని కావ్య కన్నీటి పర్యంతమైంది. తనను వెళ్లిపొమ్మని చెబుతున్నాడని, తన చావుకు కారణం అభి అంటూ ఆమె తన సెల్ఫీ వీడియోలో ఆరోపించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు