దామెరలోని ఏకశిల ప్రైమ్ పాఠశాలకు చెందిన విద్యార్థులు సహృదయ ఓల్డ్ ఏజ్ హోమ్ ని సందర్శించి నిత్యవసర సరుకులు, దుప్పట్లు మరియు దుస్తులు, చీరలు అందించి వారి యొక్క బాగోగులు తెలుసుకొని, వారికి మానసిక ధైర్యాన్ని అందించారు. సేవా భావం చాటుకున్న విద్యార్థులను ఏకశిల విద్యాసంస్థల చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏకశీల విద్యాసంస్థల డైరెక్టర్ బేతి కొండల్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు ఎంత ఎత్తు ఎదిగిన ఎంత ఉన్నత చదువులు చదివిన నైతిక విలువలు పాటించడం జీవితంలో చాలా అవసరమని, నేటి తరం పిల్లలకి చదువుతోపాటు, సేవా భావంతో కూడినటువంటి ప్రవర్తనని పాఠశాల దశలోనే నేర్పించాలని అందులో భాగంగానే ఈరోజు సహృదయ వృద్ధాశ్రమాన్ని సందర్శించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన తెలుగు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులైనటువంటి నవీన్, స్వరూప, రాణి, మమత, వినయ్ లను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ మణికుమార్ స్టాఫ్ ఇంచార్జ్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.