తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు
తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతోంది. సచివాలయాన్ని బాంబు పెట్టి పేల్చేస్తామని సీఎం పీఆర్తోకి కాల్ చేసి బెదిరించినట్టు సమాచారం. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.