కానీ అనుకున్న స్థాయిలో రిజల్ట్ దక్కలేదు. ఓపెనింగ్స్ అంతంత మాత్రంగా ఉన్నాయి. మద గజ రాజా కంటెంట్ రొటీన్ గా ఉందని తెలుగు సినీ ప్రియులు రివ్యూస్ ఇస్తున్నారు. కోలీవుడ్ హీరో విశాల్ కు తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీల్లో మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఆయన నటించిన లాంగ్ టైమ్ పెండింగ్ మూవీ మద గజ రాజా.. ఏకంగా 12 ఏళ్ల తర్వాత థియేటర్లలో రిలీజ్ అయింది. తమిళ బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో రూ.40 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో అంతా ఒక్కసారిగా షాకైపోయారు.అయితే యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఆ మూవీ.. తెలుగులో కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని మేకర్స్ నమ్మకం పెట్టుకున్నారు. అందుకే నిన్న డబ్బింగ్ వెర్షన్ ను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. టాలీవుడ్ లో మద గజ రాజా డబ్బింగ్ వెర్షన్ తడబడినట్లు స్పష్టమవుతోంది.