చైర్‌పర్సన్‌కు రోగుల ఘన సన్మానం
చేవెళ్ల ప్రజా జ్యోతి
ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన మున్సిపల్ చైర్‌పర్సన్ దేవర సమతా వెంకట్ రెడ్డి స్వంతంగా రూ.50 వేల నిధులతో వైరింగ్, పైపులైన్ పనులు చేపట్టించి డయాలసిస్ సేవలను మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆనందం వ్యక్తం చేసిన డయాలసిస్ రోగులు ఆమెను శాలువాలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రాజేంద్ర ప్రసాద్, చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్, వైస్ చైర్మన్ కాసుల రాముగౌడ్, కౌన్సిలర్లు బండారి శైలజా ఆగిరెడ్డి, మద్దెల శ్రీనివాస్, తాళ్లపల్లి నర్సింలు, కృష్ణానాయక్, మాజీ సర్పంచ్ అరుంధతి సాయి రెడ్డి తదితరులను కూడా రోగులు సన్మానించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ సమతా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయడం తమ బాధ్యత అని, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని తెలిపారు. ఆసుపత్రిలో ఉన్న సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో నాయకులు లియకత్ తదితరులు పాల్గొన్నారు.

