నర్సాపూర్ (ప్రజాజ్యోతి) నర్సాపూర్ పట్టణ కేంద్రంలో మంగళవారం సాయంత్రం సంద్యావెలలో ఒక వింత పరిస్థితి నెలకొంది. రోడ్డుకు ఒకవైపు దీపాల వెలుగులతో కళకళలాడుతుంటే, మరోవైపు అంధకారం అలుముకుంది. ఒకే పట్టణం.. రెండు వేర్వేరు లోకాలుగా కనిపిస్తూ స్థానికులను విస్మయానికి గురిచేసింది. పట్టణంలోని ప్రధాన కూడలి సమీపంలో ఉన్న ఒక విద్యుత్ స్తంభం వద్ద ఒక్కసారిగా మెరుపులు చిమ్మి ఈ సమస్య తలెత్తింది. సాంకేతిక లోపం కారణంగా ఆ స్తంభం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రధాన రహదారికి ఒక వైపు ఉన్న ప్రాంతమంతా అంధకారంలో మునిగిపోగా, అవతలి వైపు యథావిధిగా వెలుగులు ఉన్నాయి.
