వ్యాపారం చేసుకోండి…కానీ యువత ప్రాణాలతో చెలగాటం ఆడకండి..! -చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవు -సంగెం ఎస్సై వంశీకృష్ణ

Warangal Bureau
1 Min Read

వ్యాపారం చేసుకోండి…కానీ యువత ప్రాణాలతో చెలగాటం ఆడకండి..!

-చట్టాన్ని అతిక్రమిస్తే ఎంతటి వారికైనా చర్యలు తప్పవు

-సంగెం ఎస్సై వంశీకృష్ణ

సంగెం,మార్చి20(ప్రజాజ్యోతి):

18 ఏళ్ల లోపు పిల్లలకు పొగాకు ఉత్పత్తులు అమ్మడం నేరమని పాన్ డబ్బాల ముసుగులో గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠినమైన పిడి యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని సంగెం ఎస్సై వంశీకృష్ణ అన్నారు.శుక్రవారం రోజున మండలంలోని వివిధ గ్రామాలలో స్కూల్స్ కాలేజెస్ కీ సమీపంలో ఉన్న పాన్ షాపులు కిరాణా స్టోర్స్ పై తనికీలు నిర్వహించారు.ఈ సందర్బంగా సిగరెట్లతో పాటు ప్రభుత్వంచే నిషేధించబడిన గుట్కా,పాన్ మసాలా ప్యాకెట్లను నిల్వ ఉంచిన పాన్ డబ్బాలపై మెరుపు దాడులు నిర్వహించారు.అనంతరం పొగాకు నియంత్రణ చట్టం(COTPA) కింద తిమ్మాపూర్ గ్రామానికి చెందిన తాటి మొగిలి,ఎలుగురు రంగంపేట స్కూల్ ఎదురుగా ఉన్న బోనాల శ్రీనివాస్,పల్లరిగూడ గ్రామానికి చెందిన మహ్మద్ అక్రమ్ పోడేటి బాబు పై కేసు నమోదు చేశామని తెలిపారు.ఈ సందర్బంగా ఎస్ఐ వంశీకృష్ణ మాట్లాడుతూ…స్కూల్స్ కాలేజ్ లు సమీపంలో ఎటువంటి సిగరెట్లు ఉత్పత్తులు అమ్మకూడదని హెచ్చరించారు.మేము ఈ రోజు వచ్చి వెళ్ళిపోతామని అనుకోవద్దని,ఇకపై ప్రతిరోజూ నిఘా ఉంటుందని,సివిల్ డ్రెస్‌లో మా కానిస్టేబుళ్లు తిరుగుతుంటారని,ఎవరైనా దొరికితే చట్టపరమైన చర్యలు తప్పవు అని ఎస్సై స్పష్టం చేశారు.ఎస్సై వెంట కానిస్టేబుల్ లు శంకర్,నవీన్,కిషోర్,ఉన్నారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *