సూర్యాపేట జిల్లా ప్రతినిధి మార్చి 16(ప్రజాజ్యోతి):సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన శేకు రమేష్ తరుణి మిత్ర అవార్డును అందుకున్నారు.కౌమార బాలికలు, మహిళల సంక్షేమం కోసం విశేషంగా కృషి చేస్తున్న తరుణి స్వచ్ఛంద సంస్థ ఆయనకు ఈ ప్రతిష్టాత్మకమైన తరుణి మిత్ర అవార్డును అందజేశారు.ఈ నెల 13న హైద్రాబాద్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో తరుణి సంస్థ డైరెక్టర్ మమత రఘువీర్ ఈ అవార్డును తనకు అందజేసినట్లు రమేష్ తెలిపారు.తన కుమార్తెలు సుప్రజ, లక్ష్మి సృజనలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడంలోనూ, వారిని బాధ్యతాయుతమైన పౌరులుగా పెంచడంలోనూ ఆయన చూపిన నిరంతర సహకారానికి, నిబద్ధతకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందించినట్లు తెలిపారు.ఆడపిల్లల చదువుకు, ఎదుగుదలకు తోడ్పాటునందిస్తూ సమాజంలో ఒక ఆదర్శవంతమైన తండ్రిగా నిలిచినందుకు రమేష్ కు దక్కిన ఈ గౌరవం పట్ల పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.
