మాజీ జెడ్పిటిసి రోడ్డు ప్రమాదంలో మృతి

రామారెడ్డి మార్చ్ 10 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన మాజీ జడ్పిటిసి నా రెడ్డి మోహన్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మంగళవారం కారు ప్రమాదంలో హైదరాబాద్ నుండి కామారెడ్డి తిరుగు ప్రయాణంలో తూప్రాన్ ప్రాంతంలో మాసాయిపేట్ మైసమ్మ సమీపంలో కారు ప్రమాదం సంభవించి మాజీ జెడ్పిటిసి నా రెడ్డి మోహన్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. ఇదే ప్రమాదంలో మరో ఇద్దరు స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడ్డారు. మృతి చెందిన మోహన్ రెడ్డి మృతదేహాన్ని తూప్రాన్ పోలీసులు తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చరీ గదికి తరలించడం జరిగింది.అని స్థానికులు తెలపడం జరిగింది.
