చేవెళ్ల: చేవెళ్ల వాస్తవ్యులు ఒగ్గు లక్ష్మయ్య కుమారుడు ఒగ్గు ప్రభాకర్ తన పుట్టిన రోజు సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించారు. చేవెళ్ల మల్లన్న గుడికి రూ.51,000లను విరాళంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి తమ వంతు సహాయం చేయడం ఆనందంగా ఉందని ప్రభాకర్ తెలిపారు. ఆయన
సేవా భావాన్ని ఆలయ కమిటీ సభ్యులు అభినందించారు. ఒగ్గు ప్రభాకర్, వారి కుటుంబ సభ్యులపై మల్లన్న స్వామి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆలయ కమిటీ సభ్యులు కోరుకున్నారు.
