ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా 13వ వార్డులో విస్తృత పరిశుభ్రత కార్యక్రమం : కౌన్సిలర్ సమీనా మీర్ తాహేర్ అలీ

Vikarabad Staff Reporter
1 Min Read

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా 13వ వార్డులో విస్తృత పరిశుభ్రత కార్యక్రమం :వార్డు కౌన్సిలర్ సమీనా మీర్ తాహేర్ అలీ

పరిగి, మార్చి 07 (ప్రజా జ్యోతి):

ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రెండో రోజు శనివారం పరిగి మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో విస్తృత స్థాయిలో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ సమీనా మీర్ తాహేర్ అలీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

వార్డు పరిధిలోని ప్రధాన మురుగునీటి కాలవతో పాటు పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను మున్సిపల్ సిబ్బంది తొలగించి శుభ్రపరిచారు. కాలనీలలో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని స్థానికులకు కౌన్సిలర్ అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జ్ మౌనిక, మున్సిపల్, శానిటేషన్ సిబ్బంది, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *