- చిన్నచింతకుంటలో విషాదం..
నర్సాపూర్ (ప్రజాజ్యోతి):- మండల పరిధిలోని చిన్నచింతకుంట గ్రామంలో బుధవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివాహమై పది రోజులు కూడా గడవకముందే ఓ నవవధువు బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు తెలిపిన ప్రాథమిక వివారాల ప్రకారం గ్రామానికి చెందిన వెంకటచారికి, స్వాతి(భవాని) (19) అనే యువతితో గత నెల 25వ తేదీన వివాహం జరిగింది. ఎన్నో ఆశలతో అత్తవారింట్లో అడుగుపెట్టిన స్వాతి, ఏమైందో ఏమో కానీ బుధవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లయిన పది రోజులకే నవవధువు విగతజీవిగా మారడంతో రెండు కుటుంబాల్లో తీరని శోకం మిగిలింది. సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
