యువకుడి అదృశ్యం.. ఉద్యోగం రావడంలేదని మనస్థాపంతో ఇంటి నుండి వెళ్లిన వైనం
– పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు
వరంగల్ సిటీ, ఫిబ్రవరి 02(ప్రజాజ్యోతి):
ఉద్యోగం రాలేదని మనస్థాపం చెందిన ఓ యువకుడు ఇంటి నుండి చెప్పా పెట్టకుండా వెళ్లిన ఘటన నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో చోటుచేసుకుంది. వివరాలలోకెళితే నగరంలోని 40వ డివిజన్ పరిధి ఉర్సు సుభాష్ నగర్ ప్రాంతానికి చెందిన ఆవునూరి రాకేష్ (28) రెండు సంవత్సరాల క్రితం బిటెక్ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఇదిలా ఉండగా గత రెండు, మూడు నెలలుగా మనోవేదన చెందుతూ ఆందోళనతో ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం సుమారు ఒంటిగంట ప్రాంతంలో లెటర్ రాసిపెట్టి తన మొబైల్ ఫోన్ ను ఇంటి దగ్గరే పెట్టి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు రాకేష్ స్నేహితులు బంధువులు తెలిసిన వాళ్ళ వద్ద ఆచూకీ కోసం ప్రయత్నం చేశారు. ఎటువంటి ఆచూకీ లభించకపోవడంతో యువకుడి తండ్రి ఆవునూరి రమేష్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తన అబ్బాయి ఆచూకీ తెలిసిన వాళ్లు 9393059714 ఫోన్ నెంబర్ లో సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశాడు.
