- వర్ధన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 30వేల ఆర్థిక సహాయం అందించిన అల్లమనేని మోహన్ రావు.
వర్ధన్నపేట జనవరి 31, ప్రజా జ్యోతి
వర్ధన్నపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మౌలిక సదుపాయాల కల్పన కోసం 30 వేల రూపాయలను కళాశాల ప్రిన్సిపాల్ జి.పోషయ్య కు అందజేశారు.ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని వారికి కళాశాలలో కనీస అవసరాలను ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యం తో ఆర్థిక సహాయం అందించానని దాత అల్లమనేని మోహన్ రావు తెలిపారు.ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట వాస్తవ్యులు పూజారి రఘు,కళాశాల ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు.
