దామరగిద్ద 9 వ వార్డ్ నుంచి బరిలో మాచన్ పల్లి యాదయ్య

Rangareddy Bureau
1 Min Read
  1. చేవెళ్ల ప్రజా జ్యోతి
    చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని దామరగిద్ద 9 వ వార్డు నుంచి మాచన్ పల్లి యాదయ్య ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున అవకాశం కల్పిస్తే, పార్టీ విధానాలు మరియు సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఘన విజయం సాధించి చూపిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ పార్టీ నుంచి అవకాశం లభించని పక్షంలో, ప్రజల ఆశీస్సులతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. వార్డు అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, మౌలిక వసతుల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శక పాలనకు కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేస్తానని పేర్కొంటూ, దామరగిద్ద  .                    9 వ వార్డు ప్రజలు తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని యాదయ్య విజ్ఞప్తి చేశారు.
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *