బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత
—మాజీ సర్పంచ్ కందూరి బాలమణి లింబాద్రి

రామారెడ్డి మండల కేంద్రం ఈసన్నపల్లి గ్రామంలో శనివారం బాధ్యత కుటుంబాలను పరామర్శించిన గ్రామ మాజీ సర్పంచ్ కందూరి బాలమణి పెద్ద లింబాద్రి శనివారం గ్రామానికి చెందిన ఎర్రబాబు చనిపోవడం వలన వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సహాయంగా 2000/- రూపాయలు 50 కిలోల బియ్యం అందజేశారు. తదుపరి కాంగ్రెస్ కార్యకర్త బుద్ధ రణవిత్ కుమార్ చనిపోవడం వలన వారి కుటుంబానికి ఆర్థికంగా3000/- రూపాయలు 50 కిలోల బియ్యం అందజేయడం జరిగిందని కందూరి పెద్ద లింబాద్రి మానవతా దృక్పథంతో సేవాభావంతో ఆర్థిక సహాయం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గొల్ల బైరు యాదవ్, దోమకొండ బైరు, చింతల రవీందర్, గ్రామ మాజీ ఉపసర్పంచ్ బట్టు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
