మృతి చెందిన స్నేహితుని కుటుంబానికి 50.000 ఆర్థిక సహాయం
చిట్యాల:, జనవరి 10:
తమతో పదవ తరగతి 1996-97 సంవత్సరంలో చదువుకున్న మన్నెం శంకర్ ఇటీవల అకాల మరణం చెందారు. శుక్రవారం జరిగిన దశదిన కర్మ కార్యక్రమంలో శంకర్ తల్లిదండ్రులకు పూర్వ విద్యార్థులు, స్నేహితులు 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో నారబోయిన శ్రీనివాస్, ఏనుగు రవీందర్ రెడ్డి, జిట్ట మల్లేష్, లింగాల యాదయ్య, రాధారపు వెంకన్న,రుద్రవరం లింగస్వామి,పోకల కరుణాకర్, వల్లపు నరేందర్, కూరెళ్ళ రవి, కర్రె లింగస్వామి, జిట్ట వెంకన్న, రుద్రవరం మల్లయ్య, ఆదిమల లింగయ్య, చేపూరి రవీందర్ రెడ్డి, కోళ్ల దానయ్య, సిలివేరు రమేష్, నూనె యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
