వరంగల్ జిల్లాలో గెలిచిన 10 రోజుల్లోనే అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్న సర్పంచులు..

Warangal Bureau
1 Min Read

గెలిచిన 10 రోజుల్లోనే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన గ్రామ సర్పంచ్ జక్కి అనిత శ్రీకాంత్

వర్ధన్నపేట, జనవరి 8 (ప్రజా జ్యోతి):

వరంగల్ జిల్లా, వర్ధన్నపేట మండలం, నల్లబెల్లి గ్రామ నూతన సర్పంచ్‌గా ఎన్నికైన జక్కి అనిత శ్రీకాంత్ గెలిచిన పది రోజుల్లోనే గ్రామాభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి ప్రశంసలు అందుకుంటున్నారు.

గ్రామంలో ప్రధానంగా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నారు. మండలంలోనే అతిపెద్ద చెరువుగా పేరుగాంచిన నల్లబెల్లి గ్రామ చెరువు కట్టపై గత 15 సంవత్సరాలుగా ముళ్లపోదలు పెరిగి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న విషయాన్ని గమనించిన సర్పంచ్, తన తొలి తీర్మానంలోనే ఆ ముళ్లపోదలను తొలగించే పనులను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం చెరువు కట్ట సుందరీకరణ పనులను ప్రారంభించడం ద్వారా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలకు నల్లబెల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో పనిచేస్తున్నట్లు సర్పంచ్ జక్కి అనిత శ్రీకాంత్ తెలిపారు. గ్రామంలోని ఆలయాల పరిశుభ్రత, పురాతన ఆలయాలను వెలుగులోకి తీసుకురావడం, ఆలయాల సుందరీకరణతో పాటు గ్రామ పాఠశాల అభివృద్ధి కోసం కూడా త్వరలో తీర్మానాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

గెలిచిన వెంటనే ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు ప్రారంభించడంతో గ్రామ ప్రజలు సర్పంచ్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *