ఏసిబి కి చిక్కిన అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి
- అదనపు కలెక్టర్ తో పాటు ఏసీబీ వలలో మరో ఇద్దరు ఉద్యోగులు
- ఓ పాఠశాల లైసెన్స్ రెన్యువల్ కోసం డబ్బులు డిమాండ్
హనుమకొండ, డిసెంబర్ 05 (ప్రజాజ్యోతి):
ఇంచార్జీ డీఈవో గా బాధ్యతలు నిర్వహిస్తున్న అదనపు కలెక్టర్ ఓ ప్రైవేట్ యాజమాన్యాన్ని లైసెన్స్ రెన్యువల్ కోసం డబ్బులు డిమాండ్ చేశారు. ఆ పాఠశాల యాజమాన్యం ఏసిపి ని ఆశ్రయించి రెడ్ హ్యాండెడ్ గా పట్టించారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన ఏసీబీ దాడుల్లో ముగ్గురు అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడ్డారు. అదనపు కలెక్టర్ తో పాటు మరో ఇద్దరు అధికారులు పట్టు బడ్డారు. గురువారం వీరిని ఏసిబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పాఠశాల అనుమతులకు సంబంధించి రూపాయలు 1 లక్ష లంచం డిమాండ్ చేసి, అందులో రూ. 60,000 తీసుకుంటున్న సమయంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి (డిఈఓ ఇన్‌చార్జిగా కూడా పనిచేస్తున్నారు)ను వారి అదనపు కలెక్టర్ కార్యాలయంలోనే ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ కేసులో విద్యాశాఖకు చెందిన ఇద్దరు సిబ్బంది గౌస్, మనోజ్ లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుంది. ముగ్గురిని ఏసీబీ అధికారులు కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ కార్యాలయంలో విచారించి అదుపులోకి తీసుకున్నారు.
