- చెట్లతో పర్యావరణ రక్షణ సాధ్యం
- పవర్ గ్రిడ్ డీజిఎం రాములు
దామెర, సెప్టెంబర్ 30 (ప్రజాజ్యోతి):
చెట్లతో పర్యావరణ రక్షణ సాధ్యమవుతుందని పవర్ గ్రిడ్ డీజిఎం రాములు తెలిపారు. మంగళవారం దామెర మండలం ఒగ్లాపూర్ గ్రామంలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని పాఠశాల ప్రాంగణంలో పిచ్చి మొక్కలను తొలగించి చెట్లు నాటారు. ఈ సందర్బంగా డీజిఎం రాములు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి, దాన్ని సంరక్షిస్తేనే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చని తెలిపారు. పవర్ గ్రిడ్ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్బ భారత్ హరితహారం కార్యక్రమం విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో కేతిపెల్లి శ్రీధర్ రెడ్డి, కిన్నెర రమేశ్ ఆర్ట్స్, సోనాజి, సురేందర్, గ్రామస్తులు పాల్గొన్నారు.
