చిన్ననాటి మిత్రులు కలిసిన వేళ..
సదాశివనగర్ సెప్టెంబర్ 14 (ప్రజాజ్యోతి)
సదాశివనగర్ మండలం ఉత్తునూర్ ఉన్నత పాఠశాల 2001-2002 వ సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు 23 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. విద్యాబుద్దులు నేర్పిన గురువులకు పుష్పగుచ్చం అందజేసి మెమంటో ఇచ్చి శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. పాఠశాలలో ఆడిన ఆటలు, తరగతి గదిలో చేసిన అల్లర్లు అప్పటి అనుబంధం తీపి గుర్తులు గుర్తు తెచ్చుకున్నారు. ఎవరు ఏం చేస్తున్నారో ఏ ఉద్యోగాలలో స్థిరపడ్డారో ప్రస్తావించుకున్నారు. ఒకరికొకరు మాట్లాడుకుంటూ చిన్ననాటి తీపి గుర్తులు నెమరు వేసుకున్నాను. ఇలాగే అందరూ సమిష్టిగా ఉండి మీ ఐక్యతను చాటి ఉన్నత స్థాయిలో స్థిరపడాలని ఉపాధ్యాయులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
