దామెర, ఆగష్టు 25 (ప్రజాజ్యోతి):
ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో నిర్వహించిన చెస్ పోటీల్లో డిస్నీల్యాండ్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. హనుమకొండ లోని టిటిడి కళ్యాణ మండపంలో నిర్వహించిన యునైటెడ్ వరంగల్ జిల్లా 3వ ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్‌లో డిస్నీల్యాండ్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఈ చెస్ పోటీల్లో 2వ స్థానం, 4వ స్థానం గెలుపొంది పాఠశాలకు గొప్ప పేరును అందించారు. ఎన్ఐటీ టెక్నికల్ ప్రిన్సిపల్ ఎన్ సుధాకర్ విజేత లైన సిద్ధంశెట్టి కిరణ్ (9వ తరగతి, ఉమ్మడి జిల్లా 2వ స్థానం), దండిగం భాను ప్రసన్న (8వ తరగతి, జిల్లా 4వ స్థానం)లకు ట్రోఫీలు, సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. పాఠశాల యాజమాన్యం దయ్యాల మల్లయ్య, దయ్యాల సదయ్య, బాలుగు లక్ష్మినివాసం, శోభారాణి, రాకేష్ మరియు దినేష్ లు విద్యార్థులందరినీ ప్రశంసిస్తూ వారి కోచ్ జీవన్ రాజ్ ను అభినందించారు.
