కామారెడ్డి రూరల్, ఆగస్టు 22(ప్రజాజ్యోతి):
పనుల జాతర సందర్భంగా కామారెడ్డి మండలం లోని ఇస్రోజివాడి గర్గుల్ లింగయ్యపల్లి లింగాపూర్ సరంపల్లి నరసన్న పల్లి ఎలిసిపూర్ పాతరాజంపేట్ రామేశ్వరం పల్లి చిన్న మల్లారెడ్డి తిమ్మక్ పల్లి గ్రామంలో గ్రామపంచాయతీ భవనానికి రూట్ ఆఫ్ రైన్ వాటర్ భూమి పూజ చేయడం జరిగింది మరియు పనుల జాతర కార్యక్రమంలో పనుల ప్రారంభోత్సవం మరియు కొత్తగా చేపట్టే పనుల గురించి గ్రామసభ నిర్వహించి ఉపాధి హామీ పథకంలో 100 రోజులు చేసిన వారికి సన్మానం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో డిఏఓ మోహన్ రెడ్డి ఎంపీడీవో రాణి ఏపీవో అన్నపూర్ణ పిఎస్ సంతోష్ మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ సుదర్శన్ రావు పంచాయతీ కార్యదర్శి కల్పన మరియు మాజీ సర్పంచ్ భాగ్యలక్ష్మి మరియు శ్యామల బాబు మాణిక్యరావు అశోక్ మళ్లీ గంగయ్య చాట్లపల్లి మల్లేష్ చాకలి కిషన్ బండి అశోక్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.