
ఆర్యవైశ్య సత్రం అభివృద్ధికి విరాళం
— సత్రం చైర్మన్ గంజి సతీష్ గుప్తా
రామారెడ్డి ఆగస్టు 19 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండల కేంద్రంలోని శ్రీ కాలభైరవ స్వామి పరిధిలో ఆర్యవైశ్య నిత్య అన్నదాన సత్రం కు అభివృద్ధిలో భాగంగా భక్తుల సౌకర్యార్థం హ్యాండ్ వాష్ కొరకు మునిగాల భారతమ్మ వెంకయ్య, సిద్ధంశెట్టి సుజాత రమణ, గజవాడ మంజుల శ్రీనివాస్, నూతన హ్యాండ్ వాష్ నిర్మాణం కొరకు సహకరించినందుకు ఆర్యవైశ్య సత్రం చైర్మన్ గంజి సతీష్ గుప్తా, ఉపాధ్యక్షులు వలిమిశెట్టి లక్ష్మీరాజం గుప్తా, ప్రధాన కార్యదర్శి ఎల్లంకి రాజశేఖర్ గుప్తా, కోశాధికారి ఉప్పల రమేష్ గుప్తా, సహాయ కార్యదర్శి పడిగల శ్రీనివాస్ గుప్తా, కార్యవర్గ సభ్యులు వారికి ఘనంగా సన్మానం చేసి మెమొంటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, తమ్మి శ్రీనివాస్, గోవింద్ భాస్కర్, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
