నాగిరెడ్డిపేట్,ఆగష్టు12(ప్రజాజ్యోతి):
నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గోపాల్ పెట్ లో చదువుతున్న విద్యార్థులకు మండల ఎస్సై భార్గవ్ గౌడ్ 25 జతల క్రీడాదుస్తులు వితరణ చేసారు.ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్ధి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని,క్రీడల ద్వారా క్రీడాకారుడికి సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందన్నారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు.క్రీడల వల్ల కలిగే ప్రయోజనాలు,క్రీడా సర్టిఫికెట్ల ద్వారా ఉద్యోగాలు,కాలేజీలు,విశ్వవిద్యాలయాల్లో లభించే రిజర్వేషన్ గురించి విద్యార్థులకు వివరించారు.పాఠశాలకు క్రీడా దుస్తులు వితరణ చేసిన ఎస్సై భార్గవ్ గౌడ్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్ రాంరెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుడు సబాత్ కృష్ణ,ఉపాధ్యాయులు,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.