బీసీలపై మాట్లాడే నైతిక విలువ బిఆర్ఎస్ కు లేదు
— జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి
రామారెడ్డి జూలై 16( ప్రజా జ్యోతి)
బీసీలపై మాట్లాడే నైతిక విలువ బిఆర్ఎస్ నాయకులకు లేదని జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి పత్రిక ప్రకటనలో తెలిపారు. బిఆర్ఎస్ బీసీలకు ఏం చేసిందో చెప్పిన తర్వాత బిసి వర్గం పై మాట్లాడాలని, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు చేస్తున్న 42% రిజర్వేషన్ తో పాటు, ప్రభుత్వంలో వారికి న్యాయ బద్ధమైన పదవులను కాంగ్రెస్ ప్రభుత్వం అందించడం వారికి మింగుడు పడటం లేదని, బీసీలపై బిఆర్ఎస్ మొసలి కన్నీరు కార్చడం మానుకోవాలని సూచించారు.గత ఎన్నికల్లో అత్యధికంగా ఉన్న బీసీలు మీకు ఇచ్చిన తీర్పు సరిపోవటం లేదా అని ప్రశ్నించారు. తెలంగాణలోని బీసీల పట్ల మాట్లాడే హక్కు, టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చిన అప్పుడే కోల్పోయారని పేర్కొన్నారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ ను బీసీ కోటలో ఎమ్మెల్యేలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అది మరిచి, మతిస్థిమితం పోయినవాడిలా మాట్లాడడం సిగ్గుచేటని పేర్కొన్నారు.ఇకనైనా, ప్రభుత్వానికి సూచనలు ఇస్తూ,తెలంగాణ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని సూచించారు.
