గంగమ్మ వాగు బ్రిడ్జి పెండింగ్ పనులు ప్రారంభం
రామారెడి జూలై 9 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండల కేంద్రంలోని గంగమ్మ వాగు బ్రిడ్జ్ పెండింగ్ పనులను త్వరగా పునర్ ప్రారంభించాలని స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకు స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు,ఎమ్మెల్యే మదన్మోహన్ రావు కి కృతజ్ఞతలు తెలిపారు.ఏదైతే గత పాలకులు బిఆర్ఎస్ ప్రభుత్వ నాయకులు కాంట్రాక్టర్ దగ్గర కమిషన్లకు లోబడి పనులను మధ్యలో ఆపివేయడం జరిగింది..? ఈ బ్రిడ్జి పెండింగ్ పనులపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ప్రజల కు ఇబ్బందులు జరగకుండా స్థానిక కాంగ్రెస్ నాయకులు సమాచారం ఇవ్వగానే వ్యక్తిగత చొరవ తీసుకొని సుమారు 70 లక్షల రూపాయల పనిని ప్రారంభించినందుకు ఎమ్మెల్యే మదన్మోహన్ రావు కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో సీనియర్ నేత ఏఎంసీ డైరెక్టర్ రావుఫ్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ అమ్ముల పశుపతి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లక్మగౌడ్, తూర్పు రాజు,మండల సీనియర్ బండి ప్రవీణ్,జెసిబి శేఖర్,మండల కోఆర్డినేటర్ రంగు రవి, నామాల రవి,మండల యూత్ అధ్యక్షుడు పిప్పరి గణేష్, ల్యాగాల ప్రసాద్, కటికే సాయి, యూత్ ప్రెసిడెంట్ అద్నాన్, సిరిగిరి లింబాద్రి, గండ్ల రాజయ్య, ప్రజలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.