గ్రామస్థాయి అధ్యక్షుల సమ్మేళన సభ కు తరలి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు
హుస్నాబాద్, జూలై 04 (ప్రజా జ్యోతి):హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో
శుక్రవారం నిర్వహించిన గ్రామస్థాయి అధ్యక్షుల సమ్మేళనం సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్న తరుణంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు
హుస్నాబాద్ క్యాంప్ కార్యాలయం నుండి కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. సభకు తరలి వెళ్ళిన వారిలో జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య , కాంగ్రెస్ నాయకులు మాజీ కౌన్సిలర్లు చిత్తారి పద్మ రవీందర్, మ్యాదరవైన శ్రీనివాస్, సరోజన, బురుగు కృష్ణ స్వామి, వివి రమణ, పూదరి శ్రీనివాస్ గౌడ్, రమేష్, గట్టు శ్రీనివాస్ గౌడ్, పచ్చిమట్ల ప్రకాష్ గౌడ్, దుబ్బాల శ్రీనివాస్, సాంబరాజు, సాగర్, శ్రీకాంత్, బోనగిరి రజిత, దండి లక్ష్మి, గడిపే బాలు, కోటి, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు ఉన్నారు.