సిఎంసి మెడికల్ కళాశాల లీగల్ అడ్వయిజర్ గా మనోహర్…
నిజామాబాద్, ప్రజాజ్యోతి, జూన్ 7 :
క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (ఇంటిగ్రెటెడ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసర్చ్ సెంటర్) న్యాయ సలహదారుగా (లీగల్ అడ్వజర్) గా నిజామాబాద్ కు చెందిన రిటైడ్ డిఎస్పీ, న్యాయవాది బి. మనోహర్ ను నియమించారు. ఈ మేరకు మెడికల్ కళాశాల ఎం. డి. షణ్ముఖం మహాలింగం నియామక పత్రం అందజేశారు. మెడికల్ కళాశాల యాజమాన్యం నమ్మకానికి నిలబెడతనని, జిల్లా అభివృద్ధి లో కీలకం అయిన సి ఎం సి మెడికల్ కళాశాల లీగల్ సమస్యలు వెంటనే పరిష్కారం అయ్యేలా చూస్తానని బి. మనోహర్ అన్నారు. ఈ సందర్బంగా యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.