జపాన్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన బృందం టోక్యో నగరంలోని సుమిధా నదిలో పడవ ప్రయాణం చేశారు. నదీ తీర ప్రాంత అభివృద్ధిని పరిశీలించారు. టోక్యోలోని ఈ నది తరహాలోనే మూసీ నదీ తీరాన్ని ఆధునికీకరించాలనే లక్ష్యంతో అధ్యయనం సాగించారు.
ఇదిలా ఉండగా, అంతకుముందు ఎన్టీటీ డేటా, నెయిసా నెట్ వర్క్స్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం సమావేశమైంది. తెలంగాణలో రూ. 10,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎన్టీటీ డేటా, నెయిసా నెట్ వర్క్స్ సంస్థలు సుముఖత వ్యక్తం చేశాయి. హైదరాబాద్ నగరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నాయి.