ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళికి కర్నూలు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కర్నూలు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోసాని బెయిల్ పిటిషన్‌పై ఐదు రోజుల పాటు కోర్టులో వాదనలు జరిగాయి. రూ. 20 వేల పూచీకత్తు, ఇద్దరు జామీనుతో కోర్టు బెయిల్ ఇచ్చింది.
భవానీపురం కేసులోనూ విజయవాడ కోర్టు పోసానికి బెయిల్ మంజూరు చేసింది. పోసాని రేపు జైలు నుండి విడుదలయ్యే అవకాశముంది. ఆయన ప్రస్తుతం కర్నూలు జైలులో ఉన్నారు. నిన్న నరసరావుపేట జిల్లా కోర్టు కూడా ఆయనకు బెయిల్ ఇచ్చింది.