సామ్‌సంగ్ ఎస్23 ఫోన్‌పై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.50 వేల తగ్గింపు

V. Sai Krishna Reddy
1 Min Read

భారతదేశంలో ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్స్ వినియోగం బాగా పెరిగింది. ఇటీవల మంచి ఫీచర్స్‌తో వచ్చే ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ అమ్మకాలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో సామ్‌సంగ్‌కు సంబంధించిన ప్రీమియం స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎస్-23పై ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్ ప్రకటించారు. ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేసే వారిని వారి బడ్జెట్ కొంత ఆలోచనల్లో పడేస్తుంది. ఇలాంటి వారు సామ్‌సంగ్ సూపర్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్-23 256 జీబీ వేరియంట్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీ తగ్గింపును ప్రకటించింది. ఏకంగా ఈ ఫోన్‌పై రూ. 50,000 వరకు తగ్గింపు ఆఫర్ చేస్తున్నారు. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్-23 256 జీబీ వేరియంట్ ఫోన్ అసలు ధర రూ.95,999గా ఉంది. ఈ ఫోన్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో 56 శాతం భారీ తగ్గింపు తర్వాత కేవలం రూ.41,999కే లభిస్తుంది. అంటే దాదాపు సగం ధరకే ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *