రికార్డులన్నీ బ్రేక్.. శ్రీశైలం మల్లన్నకు భారీగా హుండీ ఆదాయం.. కేవలం 16 రోజుల్లోనే

V. Sai Krishna Reddy
1 Min Read

నంద్యాల జిల్లా శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో శ్రీశైల మల్లన్న ఆలయానికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం లభించింది. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు, హుండీ లెక్కింపును బుధవారం నిర్వహించారు. చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 5 కోట్ల 69 లక్షల 55 వేల 455 రూపాయల నగదు రాబడిగా లభించిందని దేవస్థానం అధికారులు తెలిపారు.. ఈ ఆదాయాన్ని గత 16 రోజులులో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో భక్తులు సమర్పించినట్లు ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. ఈహుండి లెక్కింపులో నగదుతో పాటు 87 గ్రాముల 500 మిల్లి గ్రాములు బంగారం అలానే వెండి 5 కేజీల 850 గ్రాములు లభించగా.. నగదు బంగారంతో పాటు యుఎస్ఏ డాలర్లు 885, యూఏఈ దిర్హమ్స్ 105, యూకే పౌండ్స్ 80, సింగపూర్ డాలర్లు 2, కెనడా డాలర్లు 5, మొదలైన వివిధ దేశాల విదేశీ కరెన్సీ ఈ హుండీ లెక్కింపులో లభించాయి

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *