భారత వైమానిక దళంలోని మొదటి మహిళా ఫైటర్ పైలట్లు అవని చతుర్వేది, భావన కాంత్, మోహనా సింగ్ ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వారి శిక్షణ, సాధించిన విజయాలు, వారి ప్రయాణం ఇతరులకు ఎలా స్ఫూర్తినిచ్చిందో చూద్దాం. స్వదేశీ తేజస్ విమానాన్ని నడిపిన మొదటి మహిళా పైలట్ మోహనా సింగ్ సృష్టించిన చరిత్ర గురించి తెలుసుకుంటూ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని అర్థవంతంగా సెలబ్రేట్ చేసుకుందాం. మర్చ్ 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే. ఈ ఏడాది ఉమెన్స్ డే సందర్భంగా “మహిళలు, అమ్మాయిలందరికీ హక్కులు, సమానత్వం, సాధికారత” అనే థీమ్‌ను ఎంచుకున్నారు. అయితే ఈ ప్రత్యేకమైన రోజున గతంలో వాళ్లు సాధించిన విషయాలను ఒకసారి స్మరించుకుంటే.. మహిళలంటే ఏంటో మరోసారి పురుషులకు బోధపడుతుంది. అలాగే మహిళలకు గతంలో తాము ఏం సాధించామో కూడా ఒకసారి తెలుస్తుంది. అందుకే భారత దేశానికి రక్షణగా నిలుస్తూ.. దేశాన్ని రక్షించే ఆడ సింహాల్లా.. భారత వైమానిక దళంలో చేరిన మొట్టమొదటి ముగ్గురు మహిళా ఫైటర్ పైలట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గతేడాది అవని చతుర్వేది, భావన కాంత్, మోహనా సింగ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఫైటర్ పైలట్ శిక్షణ పొందిన మొదటి మహిళలుగా చరిత్ర సృష్టించారు. భారత సాయుధ దళాలలో మహిళల ప్రాతినిధ్యం పెంచడంలో అవని చతుర్వేది, భావనా కాంత్, మోహనా సింగ్‌లు విప్లవాత్మకమైన ముందడుగు వేశారని చెప్పవచ్చు. స్క్వాడ్రన్ లీడర్ మోహనా సింగ్ భారతదేశంలోని స్వదేశీ ‘మేడ్ ఇన్ ఇండియా’ LCA తేజస్ ఫైటర్ జెట్ స్క్వాడ్రన్‌ను నిర్వహిస్తున్న ఎలైట్ 18 ‘ఫ్లయింగ్ బుల్లెట్స్’ స్క్వాడ్రన్‌లో చేరిన మొదటి మహిళా ఫైటర్ పైలట్ అయ్యారు. స్క్వాడ్రన్ లీడర్లు భావనా కాంత్, అవని చతుర్వేది ప్రస్తుతం Su-30 MKI ఫైటర్ జెట్‌లను నడుపుతున్నారు. 2016లో, అవని చతుర్వేది, భావన కాంత్‌లతో కలిసి మోహనా సింగ్, భారత వైమానిక దళం ఫైటర్ పైలట్ ప్రోగ్రామ్‌లోకి ప్రవేశించిన మొదటి మహిళలు. వీరి ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తి