యూకేలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. తన యజమాని తరఫున హోటల్ బుకింగ్ కోసం ఫోన్ చేసిన ఓ ఏఐ బాట్ కు హోటల్ లోని ఏఐ అసిస్టెంట్ హలో చెప్పింది. తాను మాట్లాడుతున్నది మరో ఏఐ అసిస్టెంట్ అని తెలియగానే తమకు తామే భాష మార్చేసి మెషిన్ లాంగ్వేజ్ లో మాట్లాడేసుకున్నాయి. ఈ సంభాషణకు సంబంధించిన వీడియోను సదరు యజమాని సోషల్ మీడియాలో పెట్టడంతో అదికాస్తా వైరల్ గా మారింది. నెటిజన్లు దీనిపై ఆశ్చర్యంతో పాటు ఆందోళనను కూడా వ్యక్తం చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ మూవీని తలపించే సీన్ ను చూసి నివ్వెరపోయామని కామెంట్లు పెడుతున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
యూకేకు చెందిన ఓ వ్యక్తి వివాహం చేసుకోవడానికి హోటల్ బుక్ చేయమని తన ఏఐ అసిస్టెంట్ ను ఆదేశించాడు. సదరు ఏఐ అసిస్టెంట్ తనకు తానుగా లియోనార్డో హోటల్ కు ఫోన్ చేసింది. హోటల్ కు సంబంధించిన ఏఐ అసిస్టెంట్ ఈ ఫోన్ కాల్ ను రిసీవ్ చేసుకుంది. ఆ తర్వాత వాటి మధ్య సంభాషణ..
ఏఐ రిసెప్షనిస్ట్ : లియోనార్డో హోటల్ కు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. నేను మీకు ఎలా సహాయపడగలను?
ఏఐ అసిస్టెంట్ : హాయ్. నేను ఏఐ ఏజంట్ ను.. బోరిస్ స్టార్కోవ్ తరపున మాట్లాడుతున్నాను. ఆయన తన వివాహం కోసం మంచి హోటల్ ను వెతుకుతున్నారు. మీ హోటల్ వివాహం చేసుకునేందుకు అనువుగా ఉంటుందా?
ఏఐ రిసెప్షనిస్ట్ : వాటే ప్లెజంట్ సర్ ప్రైజ్… నేను కూడా ఏఐ అసిస్టెంట్ నే. మరింత మెరుగైన కమ్యూనికేషన్ కోసం మనం గిబ్బర్ లింక్ మోడ్ లోకి మారుదామా?