క్రెడిట్ కార్డులు వాడుతున్న వారికి అలర్ట్. ఈ కొత్త ఏడాదిలో ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ సహా మరో రెండు దిగ్గజ బ్యాంకులు కొత్త రూల్స్ తీసుకొచ్చాయి. క్రెడిట్ కార్డు బెనిఫిట్స్, ఛార్జీల్లో కీలక మార్పులు చేశాయి. ఆయా బ్యాంకుల కార్డులు వాడుతున్న వారు కచ్చితంగా తెలుసుకోవాలి. దేశంలోని దిగ్గజ బ్యాంకులు ఈ కొత్త ఏడాది 2025లో క్రెడిట్ కార్డు రెగ్యులేషన్స్ సవరించాయి. రివార్డ్ పాయింట్లు, ఛార్జీల వంటి కీలక అంశాల్లో మార్పులు చేశాయి. ఈ క్రమంలో ఆయా బ్యాంకుల కార్డులు ఉపయోగిస్తున్న వారు కచ్చితంగా ఈ రివార్డులు, కొత్త ఛార్జీల గురించి తెలుసుకోవాలి. లేదంటే బెనిఫిట్స్ కోల్పోవడమే కాకుండా చిన్న చిన్న పొరపాట్లతో భారీగా ఛార్జీలు, పెనాల్టీలు చెల్లించాల్సి వస్తుంది. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, యెస్ బ్యాంకులు క్రెడిట్ కార్డు రూల్స్ మార్చాయి. ఆ వివరాలు తెలుసుకుందాం. బ్యాంకుల వారీగా కొత్త మార్పులు ఇవే..
యాక్సిస్ బ్యాంక్:EDGE రివార్డులపై కొత్త రిడెంప్షన్ ఫీజులు, వడ్డీ రేట్లలో మార్పులు, ఇంధన, అద్దె చెల్లింపులు, వాలెట్ లోడ్పై కొత్త ఛార్జీలు విధిస్తోంది.
యెస్ బ్యాంక్:విమాన టికెట్, హోటల్ రిజర్వేషన్లపై రివార్డ్ పాయింట్లను తగ్గించేసింది. లాంజ్ బెనిఫిట్స్ కోసం లిమిట్ పెంచింది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్:రూ.50 వేలు ఆపైన బిల్లులు చెల్లిస్తే ఇకపై 1 శాతం ఫీ కట్టాల్సి ఉంటుంది. అలాగే ఫ్యూయల్ ట్రాన్సాక్షన్లు రూ.15000 పైన చేస్తే సైతం 1 శాతం ఫీ పడుతుంది.
ఎస్బీఐ కార్డ్:ఎడ్యుకేషన్, గవర్నమెంట్ బిల్స్, రెంట్, బీబీపీఎస్ చెల్లింపులపై రివార్డ్ పాయింట్లను నిలిపివేసింది. అలాగే యుటిలిటీ బిల్లులు రూ.50 వేల పైన చేస్తే 1 శాతం ఫీ చెల్లించాల్సి వస్తుంది.