డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థులకు బ్యాంక్ ఆఫ్ బరోడా శుభవార్త చెప్పింది. భారీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. సంస్థలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 518 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. రెగ్యులర్ ప్రాతిపదికన చేపట్టే ఈ నియామకానికి అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆన్ లైన్ లో పరీక్ష నిర్వహించి, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా నియామకం చేపట్టనున్నట్లు తెలిపింది. ఎంపికైన అభ్యర్థులకు మొదటి నెల నుంచే రూ.48 వేలు చెల్లించనున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.bankofbaroda.in/career లో సంప్రదించాలని సూచించింది.
ఖాళీలు: 518 (సీనియర్ మేనేజర్, మేనేజర్-డెవలపర్ ఫుల్‌స్టాక్, ఆఫీస్-డెవలపర్, ఆఫీసర్-క్లౌడ్ ఇంజినీర్, ఏఐ ఇంజినీర్, సీనియర్ మేనేజర్ ఏఐ ఇంజినీర్, ఆఫీసర్ ఏపీఐ డెవలపర్, మేనేజర్ ఏపీఐ డెవలపర్, మేనేజర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్)
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, సీఏ, సీఎఫ్ఏ, ఎంబీఏతో పాటు పని అనుభవం