దామెర పోలీస్ స్టేషన్ పరిధిలోని కంఠాత్మకూరు గ్రామంలో పోలీసులు పిడిఎస్ బియ్యం పట్టుకున్నారు. మంగళవారం పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో అశోక్ లే లాండ్ ట్రాలీ ఆటో పోలీసులను చూసి వెనకకు తిప్పుకొని వెళ్తున్న క్రమంలో ట్రాలీ ఆటో ను వెంబడించి పట్టుకున్నారు. ట్రాలీ ఆటో లో పిడిఎస్ బియ్యం ఉన్నాయి. దీంతో వెంటనే వాహనంలో ఉన్న వారిని విచారించగా వంగపహాడ్ గ్రామానికి చెందిన తెట్టె రాజు, అంబాల గ్రామానికి చెందిన బోయిని కృష్ణ వీరిద్దరూ ప్రజల వద్ద పిడిఎస్ బియ్యం ను కొని బయట అమ్ముతున్నామని పేర్కొన్నారు. వీరి వద్ద నుంచి సుమారుగా 30 క్వింటాళ్ల బియ్యం ను స్వాదీనం చేసుకున్నట్లు దామెర ఎస్సై అశోక్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.