రోడ్డు ప్రమాదంలో యువ కాంగ్రెస్ నాయకుడు, ఆత్మకూరు మత్స్యశాఖ మాజీ చైర్మన్, పరకాల నియోజకవర్గ బీసీ కన్వీనర్ బయ్య తిరుపతిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడం తో దుర్మరణం చెందారు.. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. ఆత్మకూరు గ్రామానికి చెందిన బయ్య తిరుపతి ఆదివారం బైక్ పై నీరుకుళ్ళ గ్రామానికి ఓ కార్యక్రమానికి వెళ్లి ఆత్మకూరు కు వస్తుండగా మార్గమధ్యలో గుర్తుతెలియని వాహనం ఎదురుగా రావటంతో ఆ వాహనాన్ని తప్పించబోగా బైక్ కింద పడింది. చెవులు, ముక్కు నుండి రక్తం వచ్చి స్పాట్ లోనే మరణించాడు.. మృతుడు తిరుపతి ఆత్మకూరు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడు, ఆత్మకూరు మత్స్యశాఖ చైర్మన్ గా విధులు నిర్వహిస్తూ ఇటీవల పదవి నుంచి తప్పుకున్నాడు. పరకాల నియోజకవర్గ బీసీ కన్వీనర్ గా పనిచేస్తున్నాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. తిరుపతి మృతితో ఆత్మకూరులో విషాదఛాయలు అములుకున్నాయి…