నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అరెస్ట్
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్యారా నగర్ డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా 10 గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు. వీరికి మద్దతుగా ఆందోళనలో పాల్గొన్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని పోలీసులు అదుపులో! తీసుకున్నారు. ఈ క్రమంలో డంపింగ్ యార్డుకు చుట్టుప్రక్కల ఉన్న 10 గ్రామాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పలుచోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.