ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాలో నమోదు చేసుకోవాలి
ఎంపిడిఓ మాలోత్ శంకర్ నాయక్
పర్వతగిరి, నవంబర్ 18 (ప్రజాజ్యోతి)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఉచిత జీవిత బీమా కల్పించనున్నారు. నవంబర్ 19 నుంచి డిసెంబర్ 18 వరకు గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా నమోదు చేయనున్నారు. 18 నుంచి 59 ఏళ్లలోపు వయస్సు కలిగిన భార్య లేదా భర్తలో ఒకరికి ఈ పథకంలో అవకాశం ఉంటుందని ఎంపీడీవో మాలోత్ శంకర్ నాయక్ తెలిపారు. అర్హులైన కుటుంబాలన్నీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
