ఉత్తమ ల్యాబ్ టెక్నీషియన్‌గా ‘వంగల రాజేంద్రప్రసాద్’
* ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలకు అవార్డు
ఆత్మకూరు, మార్చి 24 (ప్రజాజ్యోతి):
ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆత్మకూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ల్యాబ్ టెక్నీషియన్‌గా ఉత్తమ సేవలు అందించిన వంగల రాజేంద్రప్రసాద్‌కు అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి చేతుల మీదుగా, సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఏ. అప్పయ్య, క్షయవ్యాధి నిర్మూలన అధికారి డాక్టర్ కె. హిమబిందు సమక్షంలో అవార్డు ప్రదానం జరిగింది. అవార్డు స్వీకరించిన అనంతరం రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. తనకు సహకరించిన అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.
