వరంగల్ బ్యూరో, ఫిబ్రవరి 26 (ప్రజాజ్యోతి):
వరంగల్ జిల్లా పైడిపల్లి వద్ద గల వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆవరణలోని వ్యవసాయ కళాశాలలో ర్యాగింగ్ కారణంగా బియేస్సి మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని రష్మిక ఆత్మహత్య కలకలం రేపింది. కళాశాలలోని ఓ గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు నల్గొండ జిల్లాకు చెందిన విద్యార్థిని అని తెలిసింది. కాగా కళాశాలలో ర్యాగింగ్ వల్లే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. కళాశాలలో సీనియర్లు ర్యాంగింగ్ కు పాల్పడుతున్నారని గతంలోనే విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పగా నచ్చజెప్పి తిరిగి కాలేజీకి పంపినట్లు సమాచారం. మరోపక్క ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి అనుబంధంగా ఇక్కడ నడుస్తున్న వ్యవసాయ కళాశాలలో కొంతకాలంగా ర్యాంగింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. విద్యార్థిని ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.