వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో అమావాస్య అన్న ప్రసాద వితరణ

Nalgonda Bureau
1 Min Read

సూర్యాపేట జిల్లా ప్రతినిధి మార్చి 20(ప్రజాజ్యోతి):అమావాస్య తిథి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కొత్త బస్టాండ్ ఫ్లై ఓవర్ వద్ద వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ వి104ఏ రీజియన్ 5 ఆర్సీ యామా సంతోష్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపమని అన్నారు.అన్ని దానాల కన్నా అన్నదానమెంతో గొప్పదని అన్నారు.అన్నదానంతో ఇతరుల కడుపు నింపడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని తెలిపారు.ఎన్నో వేల జన్మలకు గాని మానవ జన్మ ప్రాప్తించదని, అటువంటి జన్మనిచ్చిన మన పూర్వీకులను గుర్తుంచుకుని ప్రార్థించాలని పేర్కొన్నారు.అమావాస్య తిధి రోజున పితృ దేవతలకు పూజలు చేసి, వారిని స్మరించుకోవడం అన్ని విధాలుగా శుభాలను చేకూరుస్తుందని అన్నారు. ప్రతి అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అన్నదాన కార్యక్రమానికి దాతల సహకారం మరువలేనిదని అన్నారు.ఉగాది పర్వదినం సందర్భంగా స్వర్ణ కంచి జువెలరీ అండ్ టెక్స్ టైల్స్ వారి ఆధ్వర్యంలో ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఐపిసి గుడుగుంట్ల విద్యాసాగర్ బిక్కుమల్ల కృష్ణ,సీనియర్ సిటిజన్ క్లబ్ అధ్యక్షులు కొత్త వెంకటేశ్వర్లు, డిస్ట్రిక్ట్ ఇంచార్జ్ కలకోట లక్ష్మయ్య, భానుపురి సేవా బృందం శ్రీరంగం రాము, గుండా అశోక్, కందిబండ సూరయ్య దాత చందా వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *