- లారీ అద్దాలు ధ్వంసం, డ్రైవర్లకు దేహశుద్ధి చేసిన స్థానికులు
నర్సాపూర్ (ప్రజాజ్యోతి) తూప్రాన్ వైపు నుండి అక్రమంగా తరలిస్తున్న 3 లారీడలోని సుమారు వంద గోవులను నర్సాపూర్ పట్టణ కేంద్రంలో బుధవారం హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు అడ్డుకున్నారు. ముందస్తు సమాచారంతో అంబెడ్కర్ చౌరస్తా వద్ద మూడు లారీలను నిలిపివేసి, లారీ అద్దాలను ధ్వంసం చేశారు.
పారిపోయేందుకు యత్నించిన డ్రైవర్లకు దేహశుద్ధి చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని లారీలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
