ఆర్టిఐ నిబంధనలు ఆ శాఖకు వర్తించవా..?
— నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విద్యాశాఖ
— పొంతనలేని సమాధానం
— తప్పుదోవ పట్టిస్తున్న సిబ్బంది
కామారెడ్డి ప్రతినిధి మార్చ్ 07 (ప్రజా జ్యోతి)
జిల్లా విద్యాశాఖ అధికారికి ఆర్.టి.ఐ ద్వారా సమాచారం అందించాలని జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకోగా మొదటి ఆపిల్ కు సంబంధించిన వివరణ ఇవ్వలేదు..? ఆర్టిఐ దరఖాస్తుదారుడు తదుపరి వివరణ కోరగా కిందిస్థాయి అధికారి కామారెడ్డి మండల ఎంఈఓ ను సమాచార నిమిత్తం దరఖాస్తు ప్రతిని పంపడం జరిగిందని జిల్లా విద్యాధికారి డిఇఓ తెలపడం జరిగింది. దరఖాస్తు చేసి 30 రోజులు గడిచిన పిదప సమాచారం అందలేక మరోసారి 2వ అప్పీల్ చేయడం జరిగింది. తదుపరి విచారణ నిమిత్తం మరోసారి డీఈఓ కార్యాలయం నుండి ఎంఈఓ కు ప్రతిని పంపడం జరిగిందని సమాచార నిమిత్తం వివరణ ఎంఈఓ ఇవ్వడం జరుగుతుందని ఉత్తరం రాశారు. తదుపరి వివరణ కోసం ఎంఈఓ కార్యాలయానికి వెళ్ళగా సరైన సమాచారం ఇవ్వక రోజులు గడిపిన సందర్భం తదుపరి మరోసారి అప్పిల్దారుడు డీఈఓ కార్యాలయాన్ని సంప్రదించగా డిఇఓ స్పందించి వివరణ ఇవ్వాలని ఎంఈఓ కు చరవాణి ద్వారా తెలపగా ఎంఈఓ స్పందించి అడిగిన సమాధానం కి చేసుకున్న దరఖాస్తు కు సరైన సమాచారం ఇవ్వక పొంతన లేని సమాధానంతో ఎంఈఓ కార్యాలయం నుండి దరఖాస్తుదారునికి ప్రత్యుత్తరం పంపడం జరిగింది. అందులో అడిగిన సమాచారం లేదని మరోసారి ఫోన్ ద్వారా సంప్రదించగా వివరణ లేని పొంతన, సమాధానం ఇవ్వడం ఇంతవరకు న్యాయం అని ఆర్జీదారుడు తెలిపారు. ఆర్టిఏ కి విలువ లేదా..? తప్పుదోవ పట్టించడానికి సమాధానం ఆ అధికారులకు ఎందుకు అడిగిన సమాధానానికి నిర్ణీత గడువు లోపల సమాచార ఇవ్వక ఇబ్బందులకు గురి చేస్తున్న ఆ శాఖ కార్యాలయం పై సిబ్బందిపై ఆర్.టి.ఐ బ్రహ్మాస్త్రం కు విలువ ఇవ్వడం లేదని దీనిపై మరోసారి మూడవ ఆర్టిఏ దరఖాస్తు హైదరాబాద్ కార్యాలయంలో అందజేయడం జరుగుతుందని అదేవిధంగా ఆర్టిఐ ద్వారా పూర్తి సమాచారం ఇవ్వని ఆ అధికారిపై చర్యలు తీసుకునే నిమిత్తమై దరఖాసుదారుడు దరఖాస్తు చేసేందుకు సిద్ధమైనట్లు తెలిపారు.
