పోలీస్ ‘పహారా’.. నిఘా ‘తీవ్రం’!

Bharath Goud
1 Min Read
  • క్షేత్రస్థాయిలో డిఎస్పి నరేందర్ గౌడ్ తనిఖీలు
  • అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి ఆదేశం

నర్సాపూర్ (ప్రజాజ్యోతి) మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీస్ యంత్రాంగం గట్టి బందోబస్తును ఏర్పాటు చేసింది. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు అడుగడుగునా నిఘాను ముమ్మరం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను మెదక్ జిల్లా అదనపు ఎస్పీ మహేందర్రెడ్డి,  తూప్రాన్ డిఎస్పి  నరేందర్ గౌడ్ స్వయంగా పరిశీలించారు.

  • అడుగడుగునా తనిఖీ..

పోలింగ్ కేంద్రానికి వెళ్లే ప్రతి దారిని, ప్రతి వ్యక్తిని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానిత వ్యక్తులపై నిఘా ఉంచడమే కాకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు ఎస్పీ మహేందర్ రెడ్డి, డిఎస్పి నరేందర్ గౌడ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల లోపలికి వెళ్లే ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని క్షేత్రస్థాయి అధికారులకు సూచించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *