• తుజల్పూర్ గ్రామంలో విషాదం
నర్సాపూర్ (ప్రజాజ్యోతి) చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందిన ఘటన మంగళవారం నర్సాపూర్ మండల పరిధిలోని తుజల్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రాథమిక వివరాలు.. గ్రామానికి చెందిన బర్ల శ్రీశైలం చేపలు పట్టేందుకు స్థానిక చెరువుకు వెళ్లారు. చెరువులో వల వేస్తున్న సమయంలో అది ఆయన కాలుకు చుట్టుకోగా వలను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తు నీటిలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
